Sunday, December 22, 2024

షార్ట్ సర్కూట్‌తో ఇల్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

కెరమెరిః కెరమెరి మండలంలోని ఖైరి గ్రామంలో శనివారం మద్యాహ్నం షార్ట్ సర్యూట్‌తో మూడు ఇండ్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన రైతులు మోహర్లే చంద్రయ్య, మోహర్లే గిర్మాజీ, వాడై కమలబాయి, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు చంద్రయ్యకు చెందిన 20 క్వింటాళ్ల పత్తి సామాగ్రితో కలిపి 4.50 లక్షలు, గిర్మాజీకి చెందిన 15 క్వింటాళ్ల పత్తి టివి నిత్యావసర ఇతర సామాగ్రి మొత్తం ఆస్తీ 4 లక్షలు, వడై కమలబాయికి చెందిన సుమారు 2.50 లక్షలు అస్తి నష్టం జరిగింది. ఇండ్లు పూర్తిగా దగ్దం అయినయి. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోని మంటలను పూర్తిగా అర్పివేశారు. స్థానిక తహసిల్దార్ సమీర్, ఎంపిడిఓ మహేందర్, అర్‌ఐ సిద్దార్థ్‌లు బాధిత కుటుంబీకులు పరామర్శించి ఘటన, అస్తీ నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధిత కుటుంబాలని అదుకుంటాం…ఎమ్మెల్యే కోవలక్ష్మి
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రైతులు మోహర్లే చంద్రయ్య, మోహర్లే గిర్నాజీ, వాడై కమలబాయి కుటుంబాలను ప్రభుత్వపరంగా అదుకుంటామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి భరోసా కల్పించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఖైరి గ్రామానికి చేరుకోని అగ్నికి దగ్దమైన ఇండ్లని పరిశీలించారు. బాధిత కుటుంబాలని పరామర్శించి ఓదార్చారు. ఆ కుటుంబాలకు కావాల్సిన సామాగ్రి అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపిపి పెందూర్ మోతిరాం, జడ్పిటిసి దుర్పతబాయి, వైస్ ఎంపిపి అబ్దుల్ కలాం, సర్పంచ్ విజయలక్ష్మి బాలాజీ, సావర్‌ఖేడ సర్పంచ్ తులసిరాం, బిఅర్‌ఎస్ మండల అద్యక్షులు రాథోడ్ ఉత్తం నాయక్, ఎంపిటిసి సకారాం, నాయకులు పెందూర్ అనంద్‌రావు, చందు, సాకారాం, తిరుపతి, నారాయణ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News