Thursday, January 23, 2025

రూపాయి స్వల్పంగా రికవరీ

- Advertisement -
- Advertisement -

జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 77.31

 Short-term recovery possible in rupee

 

ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం 77.44 స్థాయికి పడిపోయింది. తాజాగా రూపాయి 77.32 వద్ద కొంత పెరిగింది. మంగళవారం ప్రారంభంలో ఇగది 77.27 వద్ద ప్రారంభమైంది. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతోంది. దీంతో యుఎస్ పెట్టుబడిదారులు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. ఈ కారణంగా రూపాయి మరింత బలహీనపడుతోంది. అంతర్జాతీయ కారణాలతో పాటు దేశీయ అంశాలు కూడా రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. స్టాక్‌మార్కెట్ల పతనంతో పాటు ప్రపంచ దేశాల వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో విదేశీ ఫండ్స్ అమ్మకాలు కొనసాగించడం కూడా రూపాయిపై ఒత్తిడి తెచ్చింది. ముడి చమురు ధర, ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల రూపాయి బలహీనపడింది.

ప్రభావం ఎలా ఉంటుంది?

పెట్రోలు ధరలు పెరుగుతాయి : ప్రపంచంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ 80 శాతం దిగుమతుల ద్వారా సమకూరుతుంది. ప్రభుత్వ చమురు కంపెనీలు డాలర్లలో చెల్లించి ముడి చమురును కొనుగోలు చేస్తాయి. రూపాయితో పోలిస్తే డాలర్ ఖరీదైనది. రూపాయి విలువ క్షీణిస్తే, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ముడి చమురును కొనుగోలు చేయడానికి ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల దిగుమతులు భారం అవుతాయి, పర్యవసానంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.

విదేశీ విద్య మరింత భారం : లక్షలాది మంది భారతీయ విద్యార్థులు విదేశాలలో చదువుకుంటున్నారు. వీరి ఖర్చులను తల్లిదండ్రులే భరిస్తున్నారు. అక్కడి వారి ఫీజు నుండి జీవన ఖర్చుల వరకు అంతా తల్లిదండ్రులే చెల్లిస్తున్నారు. రూపాయి బలహీనపడడం వల్ల ఇప్పుడు విదేశాల్లో వారి చదువు ఖరీదు అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ డబ్బు చెల్లించి డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ కారణంగా వారు ద్రవ్యోల్బణం షాక్‌కు గురవుతారు. జూన్ నుంచి ఆగస్టు వరకు విదేశీ అడ్మిషన్లు ప్రారంభం కావడంతో డాలర్లకు గిరాకీ ఎలాగూ పెరుగుతుంది. ఖరీదైన డాలర్ భారాన్ని తల్లిదండ్రులు భరించాల్సి ఉంటుంది.

వంట నూనెలపైనా ప్రభావం : ఎడిబుల్ ఆయిల్ ఇప్పటికే పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. డాలర్ బలపడడం వల్ల ఈ వంట నూనెల దిగుమతి మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే ఎక్కువ విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో సామాన్యులు పామాయిల్‌కు ఇతర ఎడిబుల్ ఆయిల్‌కు ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి రావొచ్చు.

ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం..

రెమిటెన్స్ పెరుగుతాయి: అధిక సంఖ్యలో భారతీయులు యూరప్ లేదా గల్ఫ్ దేశాలలో పని చేస్తున్నారు. డాలర్లలో సంపాదించి తమ సంపాదనను స్వదేశానికి పంపే భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్ చేస్తున్న దేశం భారత్. 2021 సంవత్సరంలో రెమిటెన్స్ ద్వారా భారతదేశంలో 87 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇది 2022 నాటికి ఇది 90 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో 20 శాతానికి పైగా రెమిటెన్స్ అమెరికా నుంచే వస్తోంది. భారతీయులు ఈ రెమిటెన్స్‌లను తమ దేశాలకు డాలర్ల రూపంలో పంపినప్పుడు, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతుంది. డాలర్లను తమ దేశ కరెన్సీకి మార్చుకోవడం ద్వారా ఎక్కువ రాబడిని పొందుతారు.

ఐటి పరిశ్రమకు లాభం : డాలర్ బలపడటం వల్ల దేశ ఐటి సేవల పరిశ్రమ లాభపడుతుంది. భారతదేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీలు అయిన టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్‌లు విదేశాలలో ఐటి సేవలను అందించడం ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కంపెనీలకు క్లయింట్లు డాలర్లలో చెల్లిస్తారు. దేశీయ ఐటి కంపెనీలు తమ దేశ ఆదాయాన్ని డాలర్లలో తీసుకువచ్చినప్పుడు, రూపాయి బలహీనత, డాలర్‌లో బలం నుండి వారు భారీ ప్రయోజనం పొందుతారు. డాలర్ బలం కారణంగా, విదేశాలలో సేవలను అందించడం ద్వారా ఈ కంపెనీల ఆదాయం పెరుగుతుంది.

ఎగుమతిదారులకు ప్రయోజనం : డాలర్ బలపడటం వల్ల ఎగుమతిదారులు భారీగా ప్రయోజనం పొందుతారు. ఎగుమతిదారులు ఇతర దేశాలకు ఉత్పత్తిని విక్రయించినప్పుడు వారికి డాలర్ రూపంలో చెల్లింపులు వస్తాయి. డాలర్ విలువ ఎక్కువగా ఉండడం ఉత్పత్తులకు అధిక ధరలను పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News