Thursday, November 21, 2024

సింగరేణిలో డంపర్ టైర్ల కొరత

- Advertisement -
- Advertisement -

బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి సమస్యా లేదు
కొత్త డంపర్లకు ఆర్డర్ పెట్టాం
సింగరేణి అధికారులు

మన మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణిలో వంద టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్ల టైర్ల కొరత ఏర్పడింది. దీంతో ఓపెన్ కాస్ట్ డంపర్లు నిలిచిపోతున్నాయి. ఓపెన్ కాస్ట్‌ల్లో సింగరేణి సంస్థ ఓబీ, బొగ్గు రవాణాకు వంద టన్నుల సామ ర్ధ్యం కలిగిన డంపర్లను వినియోగిస్తుంది. ఒక్కో డంపర్ 35 క్యూబిక్ మీటర్ల ఒబిని ఒక్కసారే వేరేచోటుకి రవాణా చేసి డంప్ చేస్తుంది. అయితే గత కొద్ది కాలంగా డంపర్లకు టైర్లు అందుబాటులో లేవు. ఆర్ట్ ఓసీ- 3 గనిలో 13, మణుగూరు పీకె ఓసీ- -2 -గనిలో 8 డంపర్లు టైర్లు లేక పోయాయి. డంపరు నిలిచిపోవటంతో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

వంద టన్నుల డంపర్ల టైర్లను అందించేందుకు సింగరేణి సంస్థ టెండర్లను పిలిచింది. అయితే అదే డెండర్లను రీ ప్లోట్ చేయడంతో టైర్ల కొరత ఏర్పడింది. ధరలు ఎక్కవగా ఉండటంతో తక్కువ కోట్ వచ్చేలా సింగరేణి ప్రయత్నించింది. కాని ఆశించిన స్థాయిలో తక్కువ ధరకు టెండర్లు రాక పోవడంతో డెంటర్లను రీ ఫ్లోట్ చేసింది. కోల్ ఇండియాలో డంపర్లకు ఏ టైర్లను వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఒక కమిటీని వేసింది. ఆ కమిటి కోల్‌కతాలో అధ్యయనం చేసిన నేవేదికను అందచేసింది. సింగరేణిలో 11, 15 క్యూబిక్ మీటర్ల షావెల్స్‌తో ఓబిని, బొగ్గును వెలికి తీస్తారు. ఈ షావెల్స్‌కి సరిపడా బొగ్గు మట్టిని రవాణా చేసే సామర్ధం వందటన్నుల డంపర్లకు మాత్రమే ఉంది. తక్కువ సామర్ధం గల డంపర్లను వినియోగిస్తే సంస్థకు సమయం, ఖర్చు రెండు కూడా వృథా అవుతాయి.అయితే మణిగూరు ఏరియాలో టైర్లు లేక డంపర్లు ఆగాయని, డంపర్లు అదనంగా ఉండటంతో వాటినే ఉపయోగిస్తుమన్నామని అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి సమస్యా లేదని అధికారులు చెబుతున్నారు.

వంద టన్నుల డంపర్ల టైర్లను మిచ్‌లిమ్ జేకె టైర్,బ్రిడ్జిస్టోన్ కంపెనీలు తయరు చేస్తాయి.అయితే టైర్లలో రేడి యల్, బయాన్ అనే రకాలు ఉంటాయి. బయాస్ రకంతో పోల్చితే రేడియల్ టైర్లు మన్నికంగా ఉంటాయి. ఈ రెండింటికి ధరల్లో వ్యత్యాసం కూడా ఉంది. రేడియల్‌లో ఒక రకమైతే ఒక్కొక్కటి రూ. 9 లక్షలు, ఉండగా బయాస్ రకం రూ.4.30 లక్షల వరకు ఉంటాయి.పలు కంపెనీల టైర్లను సింగ రేణి సంస్థ ప్రస్తుతం వినియోగిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News