Wednesday, January 22, 2025

ఎరువుల కొరత లేకుండా చూడండి!

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ కేంద్రాన్ని ప్రశ్నించిన టిఆర్‌ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి

Shortage of fertilizer in India

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎరువుల కోసం రైతులు సాగుపనులు వదులుకొని క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బుధవారం లోక్‌సభలో జరిగిన జీర్ అవర్‌లో మెదక్ ఎంపి (టిఆర్‌ఎస్) కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యవసాయ సాగు బాగా పెరిగిందన్నారు. ప్రధానంగా తెలంగాణ ఇది పది రెట్లకు అదనంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం పంటలు సాగుచేసే సమయంలో రైతులు ఎరువుల కోసం క్యూలైన్లలో నిలుచునే పరిస్థితి ఏర్పడడం శోఛనీయమని వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు చర్చలు జరిపితే ఒక లక్ష టన్నుల ఎరువుల కొరత ఉందని తెలిసిందన్నారు.

అసలు దేశంలో ఎరువుల కొరత ఎందుకు ఏర్పడిందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం ఎందుకు ముందస్తూ చర్యలు తీసుకోలేకపోయిందని ఆయన నిలదీశారు. ఎరువుల కొరతను వ్యాపారులు సృష్టిస్తున్నారా? లేక దేశంలో నిజంగానే ఎరువుల కొరత ఉందా? అని కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎరువుల కొరత కారణంగా….వారికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అసమర్థత కాదా? అని ఆయన ప్రశ్నించారు. లేక ఉక్రెయిన్….-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత్‌పై ఉందా? అని అడిగారు. అయితే యుద్ద ప్రభావం దేశంపై లేదని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News