Monday, December 23, 2024

పైసల పరేషాన్ల పాక్‌.. పాస్‌పోర్టులకూ కటకట

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : ఆర్థిక చక్రబంధపు పాకిస్థాన్‌లో చివరికి లామినేషన్ పేపర్‌కు కూడా కటకట ఏర్పడింది. దీనితో పాకిస్థాన్ దేశపు పాస్‌పోర్టు ప్రింటింగ్ కూడా మూలకు పడింది. దీనితో పాస్‌పోర్టుల దరఖాస్తుదారులు గందరగోళంలో పడ్డారు. ఇంతకు ముందు పాస్‌పోర్టు కార్యాలయంలో రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు వేల వరకూ పాస్‌పోర్టుల పరిశీలన, జారీ ప్రక్రియ ఉండేది. ఇప్పుడు లామినేషన్ పేపర్స్ కొరతతో కేవలం రోజుకు 12 లేదా 13 పాస్‌పోర్టులు జారీ అవుతున్నాయి. సాధారణంగా లామినేషన్ పత్రాలను పాకిస్థాన్ ఎక్కువగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఆర్థిక లావాదేవీల సంక్లిష్టతతో ఈ పేపర్ అక్కడి నుంచి సరైన కోటాలో రావడం లేదు.

దీనితో పాస్‌పోర్టు జారీ కష్టం అయింది. ఇప్పుడు దేశ పరిస్థితి నానాటికి దిగజారుతూ ఉండటంతో విదేశాలకు ఉద్యోగాలకు, చదువులకు , పర్యాటకానికి, చికిత్సలకు వెళ్లాలనుకునే వారికి పాస్‌పోర్టుల జారీ నిలిచిపోయింది. దీనితో ఎప్పటికి ఈ సమస్య కడతేరుతుందనేది కనుచూపు మేరలో కన్పించకపోవడంతో జనం పరిస్థితి అగాధం అయోమయం అయింది. ప్రస్తుత పాస్‌పోర్టుల పరిస్థితి గురించి పాకిస్థాన్ పత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రత్యేక కథనం వెలువరించింది. పెషావర్ పాస్‌పోర్టు ఆఫీసు వర్గాల నుంచి సమాచారం తీసుకుని ఈ విశేషాలను వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News