Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత

- Advertisement -
- Advertisement -

కోటగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు విద్యాబోధనపై తద్వారా ఫలితాలపై పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ పటిష్ట పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల ఖాళీలతో లక్షం చేరలేకపోతున్నారు. దీంతో విద్యావ్యవస్థ ఆశించిన ఫలితం రా వడంలేదని ఆవేదన వ్యక్తమవుతోంది.

ఇకనైనా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్తమ బోధన అందించాలనే ఆశయంతో పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఈయేడు విద్యార్థులకు నష్టం కలగకుండా క నీసం విద్యావాలంటీర్లను నియమించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఉమ్మడి కోటగిరి మండలంలో 47 ఖాళీలు : ఎంఈఓ నాగనాథ్
నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి కోటగిరి మండలంలోని ప్రైమరీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కలుపుకుని 47 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో సు మారు 1000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి సరియైన 187 పోస్టులు ఉండగా , వాటిలో 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంఇఓ తెలిపారు.

దీంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేక విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం సాధ్యమవడంలేదన్నారు. దీంతో బోధన కుటుంపడి ఆశించిన ఫలితాలు రావడంలేదన్నారు. విద్యాబోధన గాడినపడేలా విద్యావాలంటీర్లను నియమించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News