Friday, December 20, 2024

పఠాన్ కోట్ లో పాకిస్థాన్ చొరబాటుదారుడు హతం..

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ చొరబాటుదారుడని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్) హతమార్చారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో అంతర్జాతీయ బార్డర్ వద్ద చొరబాటుకు యత్నించిన వ్యక్తిని భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశారు. పఠాన్ కోట్ జిల్లా సింబాల్ సకోల్ గ్రామం సమీపంలోని బార్డర్ వద్ద ఆదివారం అర్దరాత్రి అనుమానాస్పద కదలికలతో కనిపించిన పాకిస్తాన్ వ్యక్తిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు.

సైనికుల కాల్పుల్లో పాకిస్తాన్ చొరబాటుదారుడు ప్రాణాలు కోల్పోయినట్లు బిఎస్ఎఫ్ ఉన్నతాధికారి వెల్లడించారు. కాగా, ఈ నెల 11న శనివారం కూడా టర్న్ తరణ్ సెక్టార్ వద్ద బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ చొరబాటుదారుడిని భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News