Thursday, January 23, 2025

ప్రజలకు అందుబాటులో ఉండాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : వనపర్తి జిల్లాలోని రేవల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్సై శివ కుమార్ ఎస్పికి వివరించారు. అనంతరం ఎస్పి అక్కేడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ విధులు పట్ల అంకితభావంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు.

రేవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు ఎప్పుడు కనిపించినా వెంటనే తనిఖీ చే యాలని సూచించారు. అక్రమ మార్గంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. నకిలీ విత్తనాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాలు నివారించడానికి కృషి చేయాలని తెలిపారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడానికి సిసి టివి కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. ప్రజలు ఎటువంటి సమాచారమైన డయల్ 100 ద్వారా తెలుపవచ్చని సూచించారు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలిసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి, సిఐ మహేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News