Monday, December 23, 2024

దేశ చరిత్ర సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన జీడబ్లూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా

సుబేదారి: భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల ప్రతీ యువత అవగాహన కల్గి ఉండాలని జీడబ్లూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేసిన సమరయోధుల పాత్ర గురించి నేటి యువత తెలుసుకోవాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) వరంగల్ క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబీషన్‌ను జీడబ్లూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అరుదైన చిత్రాలను కమిషనర్ ఆసక్తిగా వీక్షించారు. అనంతరం సీబీసీ వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెయింటింగ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. శ్రీధర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన అరుదైన చిత్రాలతోపాటు ఫొటో ఎగ్జిబీషన్ ఏర్పాటు చేసినట్లు వెళ్లడించారు.

గురువారం వరకు కొనసాగే ఈ చిత్ర ప్రదర్శనను ఉచితంగా విక్షించవచ్చన్నారు. జీడబ్లూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందించేందుకు పోరాడిన దేశవ్యాప్త వీరుల వివరాలు చరిత్రలో చదువుకుంటున్నప్పటికీ తెలుగు వారికి సంబంధించిన సమాచారం లభ్యత తక్కువగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో అరుదైన చిత్రాలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ వరంగల్ ఆధ్వర్యంలో ఎగ్జిబీషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ హరిప్రసాద్, నెహ్రు యువ కేంద్రం జిల్లా యువజన అధికారి అన్వేష్, పురావస్తు శాఖ కన్జర్వేటర్ మల్లేశం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఆకులపల్లి మధు, ప్రభుత్వ బాలికల హైస్కూల్ ప్రిన్సిపాల్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News