Monday, December 23, 2024

ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలి : ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : తెలంగాణ ప్రభుత్వ పథకాలతో అర్హులు లబ్ధి పొందాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్‌పల్లి, వివేకానందనగర్, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్ డివిజన్‌కు చెందిన పలువురు ఆడపడుచులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కులను మం గళవారం సప్తగిరి కాలనీలోని ఎమ్మెల్యే గాంధీ నివాసంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస్‌రావు, దొడ్ల వెంకటేష్‌గౌడ్, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావుల చేతుల మీదుగా ఎమ్మెల్యే గాంధీ పంపిణీ చేశారు. ఆడపడుచులకు కెసిఆర్ అండగా ఉంటూ వారి వి వాహానికి కట్నం అందించడం తెలంగాణలో మాత్రమే సాధ్యమైయిందన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు ఎ.లక్ష్మీనారాయణతో పాటుగా స్ధానిక నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News