Monday, December 23, 2024

ఐటిఆర్ దాఖలు చేయాల్సిందెవరు?

- Advertisement -
- Advertisement -

మీ స్థూల ఆదాయం బేసిక్ ఎక్సెంషన్ లిమిట్ దాటినట్లయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. దీనర్థం మీరు ఆదాయపు పన్ను కట్టాలని కాదు. ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం 1961కి చెందిన సెక్షన్ 87ఏ కింద రూ. 5 లక్షలు దాటితే (పాత విధానం), లేక రూ. 7 లక్షలు దాటితే(కొత్త విధానం) మాత్రమే పన్ను కట్టాలి. ఈ విధంగా ట్యాక్స్ రిబేట్ ఉంది.

మీరు పాత విధానం ప్రకారం రూ. 12500 వరకు గరిష్ఠంగా రిబేట్ పొందవచ్చు. అలాగే కొత్త విధానం ప్రకారం రూ. 25000 వరకు గరిష్ఠంగా రిబేట్ పొందవచ్చు. కనుక మీరు నిర్ధారిత పరిమితి వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అయితే మీ ఆదాయం ట్యాక్స్ రిబేట్ మూలంగా ట్యాక్స్ లయబిలిటీ ‘నిల్’ అయినప్పటికీ మీరు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటిఆర్) దాఖలు చేయాల్సి ఉంటుంది.

‘‘సాధారణంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఒకవేళ పన్ను చెల్లించనవసరం లేకుంటే అసలు ఐటిఆర్ దాఖలు చేయాల్సిన పనిలేదు అనుకుంటారు’’ అని ట్యాక్స్ ప్లానర్ డాట్ కామ్ సిఈవో, కోఫౌండర్ సుధీర్ కౌశిక్ తెలిపారు.

ఆడిట్ అవసరం లేని వారు ఐటిఆర్ ను దాఖలు చేయాల్సిన గడువు 31 జులై 2024. ఇది ఆర్థిక సంవత్సరం 2023-24(అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి.

ఆదాయపు పన్ను మినహాయింపు శ్లాబ్ లు ఈ విధంగా ఉన్నాయి:

60 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి: రూ. 2.5 లక్షల వరకు

60 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి: రూ. 3.0 లక్షల వరకు

80 ఏళ్ల పైబడిన వారికి: రూ. 5.0 లక్షల వరకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News