Wednesday, January 1, 2025

సినిమాలు ఫెయిల్ అయితే యూట్యూబ్ రివ్యూలను నిషేధించాలా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల కొన్ని తమిళ సినిమాలు…ముఖ్యంగా కంగువ, వేట్టాయన్, ఇండియన్-2 బాక్సాఫీసు వద్ద అనుకున్నంత విజయవంతం కాలేదు. అందుకు కారణం ఆయా సినిమాల్లో ఉన్న లోపాలే. కంగువ సినిమాలో కథ ఒక పట్టున ప్రేక్షకులకు అర్థం కాదు. సౌండ్, పదేపదే పోరాటం సీన్లు ప్రేక్షకులను బోర్ కొట్టిస్తాయి. వారు ఏదీ తీసినా మనం చూడాలి, ఆదరించాలి అనుకునే తత్వం వారిది. ఇక వేట్టాయన్ సినిమాలో కొత్తదనం ఏదీ కనిపించదు. ఇలాంటి మూస సినిమాలు ఇదివరకు వచ్చాయి. ఇక ఇండియన్-2 లో కమలహాసన్ కొత్తదనం ఏదీ  చూపించలేదు. కేవలం హిరోయిజం చూయించేస్తే సినిమా హిట్టయిపోతుంది అనే ధోరణిలో తీశారు.

సినిమాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రివ్యూలు రావడం, పబ్లిక్ ఓపినియన్ వీడియోల కారణంగా తమ సినిమాలు దెబ్బతిన్నాయని తమిళ సినీ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి ఓ ప్రకటనలో ఆందోళన కూడా వ్యక్తం చేసింది. మొదటి రోజున ఫస్ట్ షో కు పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకోకుండా యూట్యూబ్ ఛానల్స్ ను అనుమతించరాదని చెన్నైలోని కొన్ని థియేటర్లలో నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక నిర్మాత మండలి ఉందని తెలుస్తోంది. సూర్యుడి వెలుతురును చెత్తో ఎవరూ ఆపలేరన్నట్లు, మంచి సినిమాల సక్సెస్ ను కూడా ఎవరూ ఆపలేరన్నది గ్రహించాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News