Monday, November 18, 2024

విద్యార్థి మలద్వారంలోకి దిగిన గడ్డపార

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కొంఢమాల్ జిల్లా కోటగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో రేకుల తొలగిస్తుండగా బాలుడు పైకప్పు నుంచి కిందపడ్డాడు. అదే సమయంలో కార్మికుడు గడ్డపార పట్టుకొని ఉండడంతో దానిపై పడ్డాడు. దీంతో గడ్డపార మలద్వారంలోకి చొచ్చుకపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సువర్ణగిరి గ్రామంలో శక్తిపటగురు (16) అనే విద్యార్థి తాను చదువుతున్న పాఠశాలలో భవనం పైకి ఎక్కి రేకులను తొలగిస్తున్నాడు. ఓ రేకు విరిగిపోయి కిందజారిపడడంతో కార్మికుడు పట్టుకున్న గడ్డపారపై పడ్డాడు. గడ్డపార మలద్వారంలోకి చొచ్చుకొని పోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి గడ్డపారు బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పాఠశాలలో బాలుడితో ఎందుకు పని చేయిస్తున్నారు స్థానికులు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News