Thursday, February 6, 2025

తీన్మార్ మల్లన్నకు టిపిసిసి షోకాజ్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టిపిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు ఈ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను మల్లన్న దగ్ధం చేశారు. సర్వేలో 40 లక్షల మంది బిసిలను తగ్గించారని మల్లన్న ఆరోపించారు. కులగణన నివేదికను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్‌లో జరిగిన బిసి సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పిసిసికి ఫిర్యాదులు అందాయి.

రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి వెంటనే మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని రెడ్డి కులస్థులు డిమాండ్ చేశారు. రెడ్డి కులానికి బహిరంగ క్షమాపణ చెప్పి మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. వీటిపై వివరణ కోరుతూ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News