Monday, December 23, 2024

53మంది శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు

- Advertisement -
- Advertisement -

Show cause notices to ShivasenaMLAs

ముంబై: మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండే.. బిజెపితో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినప్పటికీ మహారాష్ట్ర రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి ఇంకా తగ్గటం లేదు. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా శాసనసభ సెక్రెటరీ విప్‌ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అందులో షిండే వర్గం ఎమ్మెల్యేలు 39 మంది ఉండగా,  ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉద్ధవ్‌ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ జులై 4న బలపరీక్ష రోజే షిండేతో చేతులు కలిపారు. తమకు షోకాజ్‌ నోటీసులు అందినట్లు ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుల (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత) నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు సెక్రెటరీ. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News