Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ వేల కోట్ల అవినీతికి నేను ఆధారాలు చూపిస్తా: జూపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతలు తాము చేసిన తప్పులు ఒప్పుకోకుండా బుకాయిస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణా రావు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదని హరీష్ రావు చెప్పగలరా అని అడిగారు.  కృష్ణా ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై సభలో చర్చ సందర్భంగా జూపల్లి మాట్లాడారు.  సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి తాను ఆధారాలు చూపిస్తానని సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా పడదని, ఎపికి రెండో సారి చంద్రబాబు సిఎం కాకూడదని కెసిఆర్ భావించారని, దీంతో సిఎం జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్ సహకరించారని, రాయలసీమ ఎత్తిపోతలకు కెసిఆర్ సహకరించారని జూపల్లి ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News