తొర్రూరు : ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్లు మర్యాదగా ప్రవర్తిస్తూ గౌరవం చూపాలని జెడ్పీప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కేసముద్రం అడ్డా ఆటో యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా మంగళపల్లి వెంకన్నతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు అందరూ కలిసి యూనియన్ గౌరవ అధ్యక్షులుగా తొర్రూరు జెడ్పీటీసీ, జెడ్పీప్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జెడ్పీప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వారిని సురక్షితంగా చేర్చాలన్నారు. రోడ్లపై ఎక్కడ బడితే అక్కడ ఆటోలను ఆపవద్దన్నారు. ఆటోలు నడిపే సమయంలో డ్రైవింగ్ పై శ్రద్ద వహించాలన్నారు. ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకునే సమయంలో, దింపే సమయంలో రోడ్డు పక్కన ఆపాలని, తద్వారా ప్రయాణికుల భద్రత లక్షంగా మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ కల్వకొలను జనార్దన్‌రాజు, ఎంపీటీసీ పల్లె దేవమ్మ, పుష్పనాధం, యూనియన్ నాయకులు లక్ష్మణ్, స్వామి, విష్ణు, రాంచంద్రయ్య, దేవయ్య, ప్రతాప్, వెంకన్న, యాకయ్య, సాయి, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.