- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాజకీయాల్లో మహిళలు తమ సత్తాను చాటాలని బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వనతీ శ్రీనివాసన్ అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కె. గీతామూర్తి సమావేశానికి అధ్యక్షత వహించారు. బిజెపి మహిళా మోర్చా జాతీయ, రాష్ట్ర, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జిలు, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేషన్ డివిజన్, మండల, పట్టణ, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -