Wednesday, January 22, 2025

ఇన్ స్టాగ్రామ్ లో వెలిగిపోతున్న శ్రద్ధా కపూర్

- Advertisement -
- Advertisement -

ముంబై:  తాజా హిందీ సినిమా ‘స్త్రీ2’ విజయవంతం అయ్యాక ఇన్ స్టాగ్రామ్ లో శ్రద్ధాకపూర్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలో అవుతున్న రెండో ఇండియన్ స్టార్ శ్రద్ధా కపూర్. ఆమెకు ఇప్పుడు 92.1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా ప్రియాంక చోప్డాకు 91.8 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే శ్రద్ధా కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో  భారత ప్రధాని నరేంద్ర మోడీ(91.3 మిలియన్ ఫాలోవర్స్)ని కూడా దాటేసింది.

ఇన్ స్టాగ్రామ్ లో టాప్ లో ఉన్న ఇండియన్ విరాట్ కోహ్లీ. అతడికి 270 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాతే శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్డా, ఆలియా భట్(85.2 మిలియన్), దీపికా పదుకొణే(79.9 మిలియన్) ఉన్నారు.

శ్రద్ధా కపూర్ తన ఫిలిం ప్రమోషన్స్ కోసం ‘స్త్రీ2’ సినిమా ఫోటోలు, తెర వెనుక ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. అంతేకాక తన జీవితానికి సంబంధించిన ముఖ్యమై ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. దాంతో ఆమె గ్రాఫ్ బాగా పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News