Friday, December 20, 2024

ఫ్రెండ్‌ను కలుసుకుందనే కోపంతో శ్రద్ధావాకర్ హత్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శ్రద్ధా వాకర్ ఒక ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు వెళ్లిందనే కోపంతో ఆమెను నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా హత్య చేశాడని ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్‌లు 6.629 పేజీల ఛార్జిషీట్‌ను సాకేత్ కోర్టులో మంగళవారం దాఖలు చేశారు. శ్రద్ధావాకర్ తన ఫ్రెండ్‌ను కలుసుకోడానికి వెళ్లిందన్న వాస్తవాన్ని నిందితుడు అంగీకరించలేక పోయాడని, ఎంతో ఆందోళన చెంది అదే రోజు ఆమెను హత్య చేశాడని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీను చౌదరి మంగళవారం విలేఖరులకు వెల్లడించారు. ఢిల్లీలో అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌లో మేలో శ్రద్ధావాకర్ హత్య జరిగింది. ఆమె శరీరాన్ని ఆఫ్తాబ్ ముక్కలు చేసి సమీప అడవి లోకి, ఇతర ప్రాంతాలకు పారవేశాడు.

దాదాపు మూడు వారాల పాటు సాక్షాలను దాచి పెట్టాడు. ఈ కేసును ఛేదించడానికి తొమ్మిది పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని, కొంతమందిని హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర లకు సాక్షాలు సేకరించడానికి పంపామని పోలీసులు చెప్పారు. శరీర భాగాలను సేకరించడానికి చాలా కాలం పట్టిందని, సాక్షాల పరిశీలనకు చాలా టెక్నాలజీ ఉపయోగించవలసి వచ్చిందని ఛౌదరి చెప్పారు. డిఎన్‌ఎ, ఇతర ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 6629 పేజీల ఛార్జిషీట్‌లో 150 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. శ్రద్ధావాకర్‌ను హత్య చేయడానికి, శరీరాన్ని ముక్కలు చేయడానికి ఆఫ్తాబ్ ఐదు రకాల కత్తులను, ఇతర పరికరాలను ఉపయోగించాడని ఛార్జిషీట్‌లో పోలీస్‌లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News