Thursday, December 19, 2024

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన శ్రావణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా పలువురు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఓ మీడియా ఛానెల్ ఎండీగా ఉన్న శ్రావణ్ కుమార్ ను పోలీసులు నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే శ్రావణ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు. తాజాగా శ్రావణ్ కుమార్‌ను రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News