ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త, ఓ టీవీ చానల్ ఎండి శ్రవణ్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించిది. ఆయనపై కఠిన చర్యలు వద్దని, అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు అయినప్పటి నుంచి శ్రవణ్ రావు పరారీలో ఉన్నారు. ఆయన అమెరికాలో ఉన్నారని భావిస్తున్నారు. ఇటీవల శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దాంతో బలవంతంగా ఆయనను అమెరికా నుంచి డిపోర్ట్ చేసే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్ర యించారు. సుప్రీంకోర్టులో అరెస్టు నుంచి రక్షణ లభించడంతో ఆయన నెలాఖరులో విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కూడా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులు అరెస్టు అయి చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. ఇటీవలే వారికి బెయిల్ లభిచింది.
ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో ఎవరూ జైల్లో లేరు. అయితే విదేశాలకు పారిపోయిన ప్రభాకర్ రావే అత్యంత కీలకం అని ఆయనతో పాటు శ్రవణ్ రావు ఇండియాకు రాగానే వారితో పాటు కెసి ఆర్, కెటిఆర్‌లను కూడా అరెస్టు చేస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించారు. వారిని కాపాడుతోంది బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ మేనని కూడా ఆరోపణుల చేశారు. ఈ క్రమంలో వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అమెరికాతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండ టంతో వారిని ఇక ఇండియాకు అప్పగిస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో వారు వచ్చినా అరెస్టు చేయకుండా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో శ్రవణ్ రావు సక్సెస్ అయ్యారు. శ్రవణ్ రావు ఓ టీవీ చానల్ కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన టీవీ చానల్ కార్యాలయంలోనే ఓ సర్వర్ మెయిన్ టెయిన్ చేసేవారని ట్యాపింగ్ కోసమే దానిని ఉపయోగించేవారని దర్యాప్తులో పోలీసులు అధికా రులు కనుగొన్నారు. ప్రభాకర్ రావు ఇంటలిజెన్స్ ఓఎస్డీగా పూర్తి స్థాయిలో ట్యాపింగ్ మీదే పని చేసేవారని అంటున్నారు. ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలతో.. ప్రభుత్వం మారగానే కేసులు నమోదయ్యాయి.
ట్యాపింగ్ సాక్ష్యాలను తారుమారు చేయడానికి మొత్తం హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేయడంతో ఇతర కాన్ఫిడెన్షియల్ సమాచారం కూడా డిలీట్ అయిందని కేసులు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరూ ముందస్తు బెయిల్ తో లేదా అరెస్టు నుంచి రక్షణ తీసుకుని నెలాఖరు లోగా లేదా ఆ తర్వాత అయినా ఇండియాకు తిరిగి రానున్నారు. దర్యాప్తునకు సహకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని భావిస్తున్నారు.