Sunday, November 17, 2024

వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం  శ్రీ సీతాలక్ష్మణ సమేత  శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్‌ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News