Sunday, January 19, 2025

వడ్డీల రూపంలో రూ.200 కోట్ల మోసం చేసిన శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వడ్డీల రూపంలో రెండు వందల కోట్ల రూపాయలు దండుకొని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ బిచానా ఎత్తేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…  అపెక్స్ బ్యాంక్ లో నిమ్మగడ్డ వాణి బాల అనే మహిళ జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. అపెక్స్ బ్యాంకుకు సమీపంలో తన భర్తతో శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ అనే ఆఫీస్ ఓపెన్ చేయించింది. తన బ్యాంక్ కు వచ్చి డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులకు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి తన భర్త ఓపెన్ చేసిన శ్రీ ప్రియాంక్ ఎంటర్ ప్రైజెస్ లో డిపాజిట్ చేయించుకున్నారు.

శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ మూసివేయడంతో తమకు న్యాయం చేయాలని వినియోగదారులు బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సిసిఎస్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. డిపాజిట్ ల రూపంలో తీసుకొని అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికి 517 మంది వద్ద ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల, తన భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు ఈ కుంభకోణంలో నిందితులుగా పోలీసులు చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News