Monday, December 23, 2024

వైభవంగా శ్రీ వైభవలక్ష్మీ పూజలు

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్: అధిక శ్రావణమాసం సందర్భంగా గద్వాల పట్టణంలోని శ్రీవాసవి కన్యాకా పరమేశ్వరీ ఆలయంలో శ్రీవైభవలక్ష్మీపూజా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం గద్వాల పట్టణాధ్యక్షుడు బిలకంటి రాములు ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా 121 మహిళా భక్తులు శ్రీవైభవలక్ష్మీపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి, గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ సతీమణి కళావతి, భక్తులు పాల్గొన్ని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము, ప్రధాన కార్యదర్శి నరహరిశ్రీనివాసులు, కోశాధికారి బిలకంటి సురేష్ కుమార్, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు మధుమతి, ప్రధాన కార్యదర్శి గట్టు రవళి, కోశాధికారి జయప్రద, యువజన సంఘం అధ్యక్షులు బాణాల వెంకటరమణ తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News