Wednesday, December 25, 2024

ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

జెడ్డాలో జరిగిన వేలంలో 26.75 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్‌కు అమ్మకం

జెడ్డా: ఐపిఎల్ వేలం 2025లో 25 కోట్ల రూపాయల మార్కును అధిగమించిన మొదటి ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ చరిత్రలో నిలిచాడు. దీంతో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ని వారి మూడవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌కు నడిపించిన తర్వాత, అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్  రూ. 26.75 కోట్లకు తీసుకున్నారు. దీంతో గత ఎడిషన్లో  రూ. 24.75 కోట్లకు కెకెఆర్ కి విక్రయించబడిన మిచెల్ స్టార్క్ మునుపటి అత్యధిక స్థాయి మార్కుని అధిగమించాడు.

అతని ఐపిఎల్ రికార్డులలో 115 మ్యాచ్‌లలో 3127 పరుగులు ఉన్నాయి, 127.48 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. అతను 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) తరపున ఐపిఎల్ అరంగేట్రం చేసాడు,  ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అతను 2022లో కెకెఆర్ కి వెళ్లి జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఒక అనూహ్య చర్యలో భాగంగా జట్టు అతన్ని మెగా వేలానికి ముందే విడుదల చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News