Saturday, January 18, 2025

ఆ సిరీస్‌కు ఎంపిక చేయనందుకు నిరాశ లేదు: అయ్యర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించకపోవడంతో అప్ఘానిస్తాన్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. దీనిపై శ్రేయస్ స్పందించారు. ఆప్ఘాన్ సిరీస్‌కు ఎంపిక చేయనందకు తనకు బాధ లేదని, రంజీ మ్యాచ్ ఆడమని చెప్పడంతో ఆడుతున్నానని వివరణ ఇచ్చాడు. తన నియంత్రణలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించనని పేర్కొన్నారు. రంజీ మ్యాచ్‌లో ఆయన ఆడుతున్న జట్టు విజయం సాధించడంతో ఆనందం వ్యక్తి చేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలంకావడంతో సెలెక్టర్లు రంజీ మ్యాచ్ ఆడాలని సూచించారు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ప్రత్యర్థి బౌలింగ్ ఎలా ఉన్న తన బ్యాటింగ్‌లో మార్పు ఉండదని అయ్యర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News