Sunday, December 22, 2024

IPL 2024: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించారు. మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ 1లో ఘన విజయం సాధించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లను ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. 2020లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును పైనల్ చేర్చాడు అయ్యర్. ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.ఇప్పటివరకు ఈ అరుదైన ఘనతను అయ్యర్ మాత్రమే సాధించాడు. మరే కెప్టెన్ రెండు జట్లను ఫైనల్‌కు చేర్చలేదు.

కాగా, మ్యాచ్ విషయాని వస్తే..  అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (3), నితీష్ రెడ్డి(9), షాబాజ్ అహ్మద్ (0)లు  విఫలమయ్యారు. అయితే రాహుల్ త్రిపాఠి (55), హెన్రిచ్ క్లాసెన్ (32) జట్టును ఆదుకున్నారు. చివర్లో కెప్టెన్ కమిన్స్ (30) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. కోల్ కతా బౌలర్లలో స్టార్క్ మూడు, చక్రవర్తి రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 13.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (23), నరైన్ (21) ధాటిగా ఆడారు. ఇక వెంకటేష్ అయ్యర్ 51(నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 58(నాటౌట్)లు అర్థ శతకాలతో చెలరేగి జట్టుకు భారీ విజయాన్ని అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News