Wednesday, January 22, 2025

శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా!

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: రాజస్థాన్ జరిగిన మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలుకావడంతో షాక్‌లో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్ నమోదు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా తప్పలేదు.

ఇదే తొలిసారి కావడంతో జరిమానాతో వదిలి పెట్టారు. మరోసారి ఇది పునరావృతం అయితే కెప్టెన్‌కు రూ.24 లక్షల ఫైన్‌ను విధిస్తారు. అంతేగాక ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లకు రూ.6 లక్షల చొప్పున జరిమాన వేస్తారు. మూడోసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతే కెప్టెన్‌పై రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News