Wednesday, January 22, 2025

అది నన్ను ఎంతగానో బాధపెట్టేది

- Advertisement -
- Advertisement -

హీరోయిన్‌గా మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది శ్రియా. ఈ ఏడాది ఆమె రెండు సినిమాల్లో అజయ్ దేవగన్ కి భార్యగా నటించింది. రెండు భారీ విజయాలు అందుకుంది. ఒకటి ‘ఆర్ ఆర్ ఆర్’, రెండోది ‘దృశ్యం 2’. ఇక ఈ భామ సోషల్ మీడియాలో ఈమధ్యన ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె భర్త ఆండ్రీ రష్యాకి చెందిన వాడు. ఆయన శ్రియాకి పబ్లిక్‌గా తెగ ముద్దులు ఇస్తుంటాడు.

ఈ ఫొటోలు ట్రోలర్స్‌కి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆమె భర్త ఈ విషయంలో ట్రోలింగ్ కన్నా మరో విషయంలో ఎక్కువ బాధపడుతుంటాడట. “మేం పెళ్లి చేసుకున్న తర్వాత నేను కొన్ని నెలల పాటు ఆయన ఫోటోలు షేర్ చెయ్యలేదు. ఆ తెల్లోడిని ఎందుకు చేసుకున్నావు. ఇండియాలో ఎవరూ దొరకలేదా.. అని కామెంట్స్ పెట్టేవారు అప్పట్లో. అవి చదివి మా ఆయన బాగా నొచ్చుకున్నారు. ఇది నన్ను ఎంతగానో బాధపెట్టేది” అని చెప్పింది శ్రియా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News