Wednesday, January 22, 2025

ఇరవై ఏళ్ల తర్వాత చిరుతో చిందెయనున్న శ్రియ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళశంకర్ చిత్రం షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా,తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి నటిస్తుంది. కాగా ప్రేక్షకులను అలరించడం కోసం చిత్రబృందం ఈ చిత్రంలో ఓ మాస్ సాంగ్ పెట్టాలనుకున్నారు.

ఈ సాంగ్ కోసం నటి శ్రియను చిత్రబృందం సంప్రందించారు. అయితే సాంగ్ లో నటించేందుకు శ్రియ ఒప్పుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 2003 లో వచ్చిన ఠాగూర్ సినిమాలో చిరుతో కలిసి శ్రియ నటించింది. మళ్లీ 20 సంవత్సరాల చిరుతో కలిసి శ్రియ చిందెయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News