Thursday, January 23, 2025

కొత్త ప్రయత్నం

- Advertisement -
- Advertisement -

Shruthi hasan is multi talented

యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ నట వారసురాలైన హీరోయిన్ శృతిహాసన్ అందరికీ సుపరిచితం. కానీ శృతి హీరోయిన్ కాక ముందే మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా గుర్తింపు దక్కించుకుంది. మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మగా పేరు దక్కించుకున్న శృతి హాసన్ మరో రంగంలో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ భామ త్వరలో డైరెక్టర్‌గా మారి ఫిల్మ్ మేక్ చేయబోతున్నట్లుగా తెలిసింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఈ సమయంలో ఏ హీరోయిన్ అయినా ఇలాంటి నిర్ణయాన్ని మాత్రం తీసుకోరు. కానీ అందరిలా తాను ఉంటే తాను యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురును ఎలా అవుతాను అనుకుందో ఏమో కాని దర్శకురాలిగా మారేందుకు సిద్ధమైంది. స్క్రిప్ట్ రైటింగ్‌లో మెలకువలను గతంలోనే నేర్చుకున్న శృతిహాసన్ దర్శకత్వంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె కొన్ని స్క్రిప్ట్‌లను రెడీ చేసుకుందట. అందులో నుండి ఒక దాన్ని తీసుకొని దాన్ని మరింతగా తీర్చిదిద్ది ఆ తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్తుందట. హీరోయిన్‌గా నటించే అవకాశాలు వరుసగా వస్తున్నా కూడా శృతిహాసన్ మాత్రం ఆచి తూచి ఆఫర్లను ఎంపిక చేసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News