Wednesday, January 22, 2025

తండ్రి కమల్ హాసన్, బాయ్ ఫ్రెండ్ తో శ్రుతిహాసన్ న్యూ ఇయర్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

కొత్త సంవత్సరం వేడుకలను విదేశాల్లో విహరిస్తూ జరుపుకోవడం సినీస్టార్లకు అలవాటు. ఈసారి కూడా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులంతా విదేశాల బాట పట్టారు. కానీ శ్రుతీహాసన్ మాత్రం అందుకు విరుద్ధంగా చెన్నైలో బంధువుల మధ్య జరుపుకుంది. తన తండ్రి, ప్రముఖ స్టార్ కమల్ హాసన్, మేనత్త, నటి సుహాసిని, ఆమె భర్త ప్రముఖ డైరెక్టర్ మణిరత్నంలతో కలసి ఆటపాటల మధ్య వేడుకగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించింది.

కేవలం బంధువులకు మాత్రమే పరిమితమైన ఈ పార్టీకి ఒకే ఒక్క స్పెషల్ గెస్ట్ వచ్చాడు. అతని పేరు శాంతను హజారికా. శ్రుతి బాయ్ ఫ్రెండ్ అయిన శాంతనూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడంతో ఇద్దరి మధ్యా ఏదో ఉందంటూ వినబడుతున్న పుకార్లు నిజమేనని కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ ఇద్దరికీ పెళ్లయిపోయిందంటూ ఇటీవల వచ్చిన పుకార్లను శ్రుతి ఇటీవల ఖండించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫోటోలను శ్రుతి స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News