Monday, December 23, 2024

ప్రేమ లేనిది జీవితం వృథా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అందాల తార శృతి హాసన్ ప్రస్తుతం శాంతను హజారికా అనే ఆర్టిస్ట్‌తో సహజీవనం చేస్తోంది. ఆమె తన ప్రేమ వ్యహారాలను ఎప్పుడూ దాచుకోలేదు. పైగా, ఈ కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కొన్ని ఫన్నీ వీడియోలను చాలా సార్లు చేసింది. ప్రేమ లేనిది జీవితం వృధా అనేది ఈ అమ్మడి భావన. మరి ప్రేమ కోసం, ప్రియుడి కోసం ఏమైనా చేస్తావా? అని అభిమానులు అడిగితే ‘ఒక్కటి తప్ప ఏదైనా చేస్తాను. పాములను ముట్టుకోమని అడిగితే చచ్చినా చెయ్యను. అసలు ఆ ఆలోచన వస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది, అని చెప్పింది ఈ భామ. అలాగే, ఇంతవరకు తాను ఎప్పుడూ మొబైల్ డేటింగ్ యాప్ లలో రిజిస్టర్ కాలేదు అని అంటోంది. డేటింగ్‌కి వెళ్ళడానికి యాప్‌లలో వెతుక్కోవాల్సిన అవసరం రాలేదట శృతికి.

Shruti Haasan dating with boyfriend Santanu Hazarika

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News