Monday, December 23, 2024

‘మెగా154’లో శృతి హాసన్..

- Advertisement -
- Advertisement -

Shruti Haasan opposite to Chiranjeevi in 'Mega 154'

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూకుడు మీదున్నారు. యువ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన ఆయన భోళాశంకర్, గాడ్ ఫాదర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవి సెట్స్ మీద ఉండగానే బాబీ దర్శకత్వంలో మెగా 154, వెంకీ కుడుములతో మెగా 155 చిత్రాలు ప్రకటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న చిరు 154కు హీరోయిన్ కుదిరింది. విశ్వనాయకుడు కమల్‌హాసన్ కూతురు శ్రుతిహాసన్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ విషయాన్ని మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “మెగా154లో శ్రుతిహాసన్ అడుగుపెట్టింది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Shruti Haasan opposite to Chiranjeevi in ‘Mega 154’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News