Sunday, January 19, 2025

ధనుష్తో వివాదం.. నయనతారకు హీరోయిన్స్ సపోర్ట్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య నెలకొన్న వివాదం కోలీవుడ్ లో సంచలనంగా మారింది. నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న తన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ కోసం నయనతార.. ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ ధాన్’లోని క్లిప్‌ను ఉపయోగించింది. ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో కనిపించగా, ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడు. అయితే ఆ డాక్యుమెంటరీలో తన సినిమాలోని 3 సెకన్ల కిప్ ను ఉపయోగించుకోవడానికి ధనుష్ అనుమతించలేదు.దీనిపై నయనతార తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ధనుష్ ను విమర్శిస్తూ నయన్ శనివారం 3 పేజీల బహిరంగ లేఖ రాసింది. ఆమె రాసిన లేఖ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ‘నానుమ్ రౌడీ ధాన్’ చిత్రంలోని ఒక పాటకు సంబంధించిన 3 సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ తనపై 10 కోట్ల రూపాయల దావా వేసినట్లు నయన్ ఆరోపించింది.

లేఖలో.. ఈ చిత్రానికి నిర్మాత అయిన ధనుష్, సాంగ్ BTS క్లిప్‌ను కూడా ఉపయోగించనివ్వలేదని.. ఇది సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉందని.. పర్సనల్ డివైసెస్ నుండి తీసుకున్నట్లు పేర్కొంది. నానుమ్ రౌడీ ధాన్ నుండి క్లిప్‌ను ఉపయోగించడానికి ధనుష్ నుండి అనుమతి పొందేందుకు తాను ఎదుర్కొన్న పోరాటాలను వెల్లడించింది. కొంచెం ఘాటుగానే విమర్శించింది. నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుందంటూ తీవ్ర విమర్శలు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం తమిళ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. అయితే.. ఈ వివాదంలో నయన్ కు పలువురు హీరోయిన్స్ మద్దతు తెలుపుతున్నారు.

ధనుష్‌తో కలిసి పనిచేసిన శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్‌తో సహా పలువురు తమిళ నటీమణులు స్పందించి నయనతారకు సపోర్ట్ గా నిలుస్తున్నట్లు ఆ పెట్టిన పోస్ట్ ను లైక్ చేశారు. వీరితోపాటు ఐశ్వర్య లక్ష్మి, అనుపమ పరమేశ్వరన్, పృథ్వీ తిరువోతు, మంజిమా మోహన్, గౌరీ జి కిషన్ లు కూడా నయన్ కు మద్దతు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News