Wednesday, January 22, 2025

ఇవన్నీ గేమ్‌లో భాగమే

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది. పేరుకు ఆమె హీరోయిన్ అయినప్పటికీ సినిమాలో ఆమె పాత్ర నిడివి మాత్రం చాలా తక్కువ. దీనికి సంబంధించి ఆమెపై చాలా కామెంట్స్ వినిపించాయి. హీరోయిన్ రోల్‌గా చెప్పుకునే ఇలాంటి అతిథి పాత్రలు చేయాల్సిన అవసరం ఏముందని చాలామంది ప్రశ్నించారు. ‘సలార్’లో తన పాత్ర నిడివిపై పూర్తి స్పష్టత ఇచ్చింది శృతిహాసన్. ఓ మంచి వంటకం తయారవ్వాలంటే అందులో అన్నీ సమపాళ్లలో ఉండాలని, ‘సలార్’లో తన పాత్ర కూడా అంతేనని స్పష్టం చేసింది.

పైగా సూపర్ హిట్ అవుతుందని మనసుకు అనిపించినప్పుడు ఎందుకు వదులుకోవాలని ప్రశ్నిస్తోంది. “ఓ సినిమాకు సంతకం చేసేటప్పుడు చాలా అంశాల్ని లెక్కలోకి తీసుకుంటాను. సలార్‌లో నా పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ… నాది మంచి పాత్ర. అందుకే సలార్ సినిమా చేశాను. నేను కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించాను. కానీ వాటిలో కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మరికొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసినప్పటికీ పెద్ద హిట్టయ్యాయి. ఇవన్నీ గేమ్‌లో భాగమని.. హిట్ సినిమాలో ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే”అని అంటోంది శృతిహాసన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News