Friday, November 15, 2024

పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న శుభకృత్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు
అన్ని రంగాల్లోనూ శుభం చేకూరాలి :
సిఎం కెసిఆర్

Shubhakrut carrying good luck with name

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉగాది పండుగ శుభా కాంక్షలు తెలియజేశారు. పేరుతోనే శుభాల ను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సం వత్సరం, ప్రజలకు అ న్ని రంగాల్లో శుభా లను చేకూర్చనున్నదని
ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని సిఎం ఆనందం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమౌతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని సిఎం అన్నారు.

ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని సిఎం తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వాలలో దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అగ్రస్థానంలో ఉందన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని సిఎం అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. వ్యవసాయం బాగుంటెనే సర్వ జనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు.

కరోనా వంటి కష్టకాలంలోనూ రాష్ట్ర వ్యవసాయ రంగం దేశ జిడిపికి దోహదపడడంలో ముందున్నదన్నారు. ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో రాష్ట్ర వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోశిస్తున్నదని సిఎం కెసిఆర్ అన్నారు.అనతి కాలంలోనే అన్ని రంగాలను పటిష్టపరుచుకున్నామనీ, ‘శుభకృత్ నామ సంవత్సరం లో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని సిఎం అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News