Monday, December 23, 2024

శుభమ్ కుమార్‌కు టైటిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన స్లాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో బీహార్‌కు చెందిన శుభమ్ కుమార్ టైటిల్ సాధించాడు. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు కెనడా, అమెరికా, యెమన్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఫిడె 1600 రేటింగ్ చెస్ టోర్నీలో 575 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ఇందులో బీహార్‌కు చెందిన శుభమ్ కుమార్ విజేతగా నిలిచాడు.

తెలంగాణ అమ్మాయి యశ్వి జైన్ రన్నరప్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ తృతీయ స్థానంలో నిలిచాడు. విజేతకు లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. ఫస్ట్ రన్నరప్ యశ్వి జైన్‌కు రూ.60 వేలు,సెకండ్ రన్నరప్ సాత్విక్‌కు రూ. 40 వేల నగదు బహుమతి లభించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్లాన్ స్పోర్ట్ సిఈఓ నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News