Sunday, January 19, 2025

గిల్ సెంచరీ… 346 పరుగుల ఆధిక్యంలో భారత్

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 53 ఓవర్లలో 203 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. గిల్ 132 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో భారత్ ఇప్పటి వరకు 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ బ్యాట్స్‌మెన్లు శ్రేయస్ అయ్యర్(29), యశస్వి జైస్వాల్(17), రోహిత్ శర్మ(13), రజత్ పాటీదర్(09) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(101), అక్షర పటేల్(33) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్ సన్ రెండు వికెట్లు తీయగా రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లే చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News