Thursday, March 13, 2025

శుభ్ మన్ గిల్ కు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

టాప్3లో రోహిత్, కుల్దీప్, ఐసిసి వన్డే ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కె ప్టెన్ రోహిత్ శర్మ రెండు ర్యాంక్‌లను మెరుగుపర్చుకుని మూడో స్థా నానికి చేరుకున్నాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి టాప్3లో నిలిచాడు. స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా కూడా టాప్10లో స్థానం దక్కించుకున్నాడు. ఫైనల్లో జడేజా పొదుపుగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇక శుభ్‌మన్ గిల్ 784 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆశించిన స్థాయిలో రాణించక పోయి నా గిల్ టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. బాబర్ 770 పాయింట్లతో గిల్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా సారథి రోహిత్ 756 పాయింట్లతో మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో రోహిత్ కెప్టెన్సీ ఇన్నిం గ్స్ ఆడాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతను రెండు స్థానాలను మెరుగు పరుచుకున్నాడు. సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసె న్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టీ మిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా ఒక ర్యాంక్‌ను కోల్పోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి ఐదో స్థానంలో ని లిచాడు. ఇంతకుముందు అతను నాలుగో ర్యాంక్‌లో ఉన్న సంగతి తె లిసిందే.

న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఐర్లాండ్ ఆటగా డు హ్యారి టెక్టర్ ఒక ర్యాంక్ కోల్పోయి ఏడో స్థానంలో నిలిచాడు. టీ మిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 8వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన సంగతి తెలిసిందే. అసలంక (శ్రీలంక) తొమ్మి దో, ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్థాన్) పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

టాప్‌లోనే తీక్షణ..

మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక యువ సంచలనం మహీశ్ తీక్షణ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తీక్షణ 680 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిఛెల్ సాంట్నర్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. సాంట్నర్ తాజా ర్యాంకింగ్స్ లో ఏకంగా ఆరు స్థానాలను మెరుగు పరుచుకుని టాప్2లో నిలవ డం విశేషం. భారత సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ నిలకడ గా బౌలింగ్ చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ మూడు ర్యాంక్‌ల ను మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం అతను మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు ర్యాంక్ లు కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నమీబియా బౌ లర్ బెర్నార్డ్ స్టాల్ట్ ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఆరో, అఫ్గాన్ స్టార్ రషీద్ ఖాన్ ఏడో, విండీస్ బౌలర్ మోటి 8వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. పాక్ స్పీడ్‌స్టర్ షహీన్ అఫ్రిది తొ మ్మిదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ ర వీంద్ర జడేజా మూడు ర్యాంక్‌లు మెరుగు పరుచుకుని టాప్10లో నిలిచాడు. మహ్మద్ షమి 13వ, మహ్మద సిరాజ్ 14వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News