Wednesday, January 22, 2025

గిల్ తీరుపై గావస్కర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

ముంబై: చివరి టెస్టులో శుభ్‌మన్ గిల్ ఆటతీరుపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ విస్మయం వ్యక్తం చేశాడు. ఇంకెన్నిసార్లు ఇలాగే ఔటవుతావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. అజాజ్ పటేల్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన గిల్ వికెట్ సమర్పించుకున్నాడు. బంతి దూరంగా స్పిన్ అవుతుందని భావించినా అది స్టంప్స్ పైకి దూసుకొచ్చేవరకూ గమనించడంలో విఫలమయ్యాడని, కనీసం డిఫెన్స్ చేయలేకపోయాడని, తన ప్యాడ్లతో డిఫెన్స్ చేసినా గిల్ అంపైర్ నిర్ణయంతో ఎల్‌బిడబ్ల్యూ నుంచి తప్పించుకునేవాడని గవాస్కర్ పేర్కొన్నాడు. దీంతో గిల్ ఔటైన తీరుపై వ్యాఖ్యాతగా ఉన్న గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ”బంతిని వదిలేస్తూ గిల్ ఔటవ్వడం మనం ఇంకెన్ని సార్లు చూడాలి? బంతిని అంచనా వేయడంలో విఫలమై స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లకు తన వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఏ బంతిని వదిలెయ్యాలి? ఏ బంతిని ఆడాలి? అనే దానిపై గిల్ సాధన చేయాలి” అని గవాస్కర్ చురకలంటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News