Thursday, November 21, 2024

ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన గిల్

- Advertisement -
- Advertisement -

Shubman climbed 93 places to 38th position in the rankings.

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సమరంలో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచిన గిల్ ర్యాంకింగ్స్‌లోనూ ప్రకంపనలు సృష్టించాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ ఏకంగా 93 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో గిల్ మూడు మ్యాచుల్లోనే 245 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. దీంతో ర్యాంకింగ్స్‌లో గిల్ మెరుగైన స్థితికి చేరుకున్నాడు. ఇక ఇదే సిరీస్‌లో సెంచరీతో అలరించిన జింబాబ్వే స్టార్ బ్యాటర్ సికిందర్ రజా కూడా నాలుగు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని 25వ స్థానానికి దూసుకెళ్లాడు.

కోహ్లి, రోహిత్ ర్యాంక్‌లు పదిలం

మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తమ పాత ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఐదో, రోహిత్ శర్మ ఆరో ర్యాంక్‌లో నిలిచారు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 890 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్లు వండర్ డుసెన్ రెండో, క్వింటన్ డికాక్ మూడో ర్యాంక్‌లో నిలిచారు. పాకిస్థాన్ బ్యాటర్ ఇమాముల్ హక్ నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) రెండో, ముజీబుర్ రహ్మాన్ (అఫ్గాన్) మూడో ర్యాంక్‌లో నిలిచారు. భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News