Monday, January 20, 2025

హైదరాబాద్ వన్డే.. శుభ్‌మ‌న్ గిల్ డబుల్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాధించిన ముచ్చట తెలిసిందే. గిల్ 87 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. గిల్ ఇటీవల శ్రీలంకతో మూడో వన్డేలోనూ సెంచరీ బాదాడు. సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ బుధవారం ఉప్పల్ స్టేడియంలోనూ కివీస్ ప్లేయర్లను పరుగులు పెట్టించాడు. టీమిండియా స్కోరు 48 ఓవర్లలో 7 వికెట్లకు 324 పరుగులు చేశారు. గిల్ 145 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 345/7.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News