Friday, January 17, 2025

పుత్రోత్సాహం: గిల్ శతకం.. స్టాండ్స్ లో తండ్రి ఆనందం!

- Advertisement -
- Advertisement -

కొడుకు రాణిస్తుంటే చూసి ఆనందించాలని ఏ తండ్రయినా అనుకుంటాడు. లక్షలాదిమంది వీక్షించే క్రికెట్ లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న శుభమన్ గిల్ ను చూసి, అతని తండ్రి కూడా అలాగే ఆనందించాడు! ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఈ దృశ్యాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి.

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీ చేయగానే స్టాండ్స్ లో ఉన్న అతని తండ్రి లఖ్వీందర్ సింగ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు! లేచి నిలబడి చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News