టాప్-5లోకి విరాట్, ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. గిల్ 817 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మమూడో ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. అతను మూడో స్థానంలో ఉన్నాడు.
సౌతాఫ్రికా విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని తిరిగిటాప్5లో చోటు సంపాదించాడు. పాక్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో కోహ్లి అజేయ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లి ఐదో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్), హ్యారి టెక్టర్ (ఐర్లాండ్), అసలంక (శ్రీలంక), శ్రేయస్ అయ్యర్ (భారత్), షాయ్ హోప్ (విండీస్) టాప్10లో చోటు కాపాడుకున్నారు. బౌలింగ్ విభాగంలో శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రషీద్ ఖాన్ (అఫ్గాన్) రెండో ర్యాంక్‌లో నిలిచాడు.భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.