Monday, December 23, 2024

శుభ్‌మన్ గిల్ అర్దశతకం.. భారత్ స్కోర్ 89/1

- Advertisement -
- Advertisement -

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు విజృంభిచడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ 150 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 133.5 ఓవర్లలో 404 పరుగులకు ఆలౌటైంది.

భారత్ రెండో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (23) పరుగులకు ఔటయ్యాడు. బంగ్టా బౌలర్ ఖలీద్ వేసిన షార్ట్ పిచ్ బంతికి(22.4వ ఒవర్) పెవిలియన్ చేరాడు. దీంతో శుభ్ మన్ గిల్ తో తొలి వికెట్ జోడించిన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరో వైపు గిల్ అర్దశతకం 55(86)సాధించాడు. ప్రస్తుతం భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్, ఛతేశ్వర్ పుజారా2(10) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News