Friday, December 20, 2024

టీమిండియాకు షాక్..

- Advertisement -
- Advertisement -

పెర్త్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయానికి గురైనట్టు సమాచారం. నవంబర్ 22 నుంచి జరిగే తొలి టెస్టులో అతను బరిలోకి దిగడం సందేహంగా మారింది. బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న సంగతి తెలిసిందే. సిరీస్ కోసం టీమిండియా సాధన కూడా ప్రారంభించింది.

ప్రస్తుతం పెర్త్‌లో భారత్ ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడుతోంది. కాగా, ఈ మ్యాచ్ సందర్భంగా శుభ్‌మన్ గాయానికి గురైనట్టు తెలిసింది. ఇండియా వర్సెస్ ఇండియాఎ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ వేలికి గాయమైనట్టు తెలిసింది. గాయం తీవ్రతను మెడికల్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఇప్పటి వరకు గిల్ గాయంపై బిసిసిఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News