Tuesday, January 7, 2025

రెండో టెస్టుకూ శుభ్‌మన్ గిల్‌ దూరం..?

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆతిథ్య జట్టుతో రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. అయితే, రెండో టెస్టుకు కూడా భారత బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్‌ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కు ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లో గిల్ గాయపడ్డాడు. దీంతో అతను తొలి టెస్టు ఆడలేదు.

ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో గిల్ రెండో టెస్టుకూ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సమాచారం. గాయం పూర్తిగా నయం కావాలంటే.. మరో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని గిల్ కు వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో అడిలైడ్‌ టెస్టుకు గిల్‌ దూరం కానున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది. ఆసీస్ ను చిత్తు చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News