Wednesday, January 22, 2025

గిల్ వీరవిహారం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే శతకంతో గుజరాత్‌ను ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడిన గిల్ 60 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 129 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో గిల్‌కు ఇదిన మూడో సెంచరీ కావడం విశేషం. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన గిల్ ఆ తర్వాత దూకుడును పెంచాడు. ముంబై బౌలర్లను హడలెత్తిస్తూ వరుస సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. సాయి సుదర్శన్ (43), హార్దిక్ పాండ్య 28 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత లక్షఛేదనకు దిగిన ముంబై తాజా సమాచారం లభించే సమయానికి 16 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News